పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
హైదరాబాద్:-
మరోసారి పేకాట స్థావరంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
Police Raids on Gambling Den
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్‌లో నిర్వహించిన దాడుల్లో నిర్వాహకుడితో పాటు ఏడుగురు పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
భగత్ సింగ్ నగర్ లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట స్థావరంపై సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు నిన్న రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది.
ఈ దాడుల్లో నిర్వాహకుడు లాలూ యాదవ్‌తో పాటు మొత్తం ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
పేకాటరాయుల్ల వద్ద నుంచి 7 మొబైల్ ఫోన్లు, రూ.99 వేల 880 నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
పట్టుబడిన వారిపై గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.



