- Advertisement -
పోలీసు భద్రత పథకం చెక్కు అందించిన ఎస్పీ
జగిత్యాల,
పోలీసు భద్రత పథకం పోలీసు కుటుంబాలకు ఆర్థిక భరోసా కలిగిస్తుందని జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ఫ్రిత్ సింగ్ అన్నారు. జగిత్యాల జిల్లా
వెల్గటూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఏఎస్సై రాజమల్లయ్య కుటుంబానికి జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ భద్రత పథకం కింద మంజూరు కాబడిన 7,63,040 రూపాయల చెక్కును రాజమల్లయ్య భార్యకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ సన్ ఫ్రిత్ సింగ్ మాట్లాడుతూ…. రాజమల్లయ్య కుటుంబానికి పోలీస్ శాఖ తరుపున పూర్తి సహకారం అందిస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి అమర్నాథ్, సూపరిండెంట్ నయీం పాల్గొన్నారు.
- Advertisement -