Sunday, September 8, 2024

పవన్ కల్యాణ్ కు సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి పోలీసులు

- Advertisement -

పవన్ కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

విజయవాడ, అక్టోబరు 4:  వారాహి యాత్రలో భాగంగా ఇవాళ పెడన సభలో సభ జరగనుంది. ఈ సభలో ప్రభుత్వం అసాంఘిక శక్తులతో దాడులు చేయించేందుకు కుట్ర చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్‌ ఒక్కసారిగా కలకలం సృష్టిస్తున్నాయి. తీవ్ర ఆరోపణలపై పోలీసులు స్పందించారు. పవన్ చేసిన ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సమర్పించాలని జనసేన అధినేతకు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ సమాచారానికి బేస్ ఏంటని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడం సరికాదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కౌంటర్ ఇచ్చారు. తాము ఇచ్చిన నోటీసులకు రిప్లై రాలేదని అలా రాని పక్షంలో ఆయన చేసిన ఆరోపణలు నిజం కావని అభిప్రాయపడాల్సి ఉంటుందన్నారు. పవన్‌ కల్యాణ రెచ్చగొట్టే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అందుకే నోటీసులు ఇచ్చామన్నారు పోలీసులు. దాడులు జరగుతాయనే సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని కోరినట్టు పేర్కొన్నారు. తాము పంపిన నోటీసులకు పవన్‌ నుంచి ఎలాంటి రిప్లై రాలేదని పోలీసులు వివరించారు. రిప్లై రాలేదంటే ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారాని అనుకోవాలా? అని ప్రశ్నించారు. ఎటువంటి సమాచారంతో పవన్‌ వ్యాఖ్యలు చేశారని నిలదీశారు. సరైన ఆధారాల్లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదని పోలీసులు హితవు పలికారు. ఇంకా ఏమన్నారంటే…బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయి. రెచ్చగొట్టే భాష, సైగలు మానుకుని మాట్లాడాలి. మా సమాచార వ్యవస్థ మాకుంది. పవన్‌ కంటే నిఘా వ్యవస్థ మాకు బలంగా ఉంది.

Police should tell Pawan Kalyan where the information came from
Police should tell Pawan Kalyan where the information came from

అసాంఘిక శక్తులుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’’ అని ఎస్పీ జాషువా అన్నారు. పెడనలో జరగనున్న వారాహి యాత్రలో అలజడి సృష్టించేందుకు  వైఎస్ఆర్‌సీపీ గూండాలు, రౌడీలతో ప్రయత్నిస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాళ్ల దాడులు చేసి రక్తపాతం సృష్టించాలని అనుకుంటున్నారని  మచిలీపట్నంలో ఆరోపించారు. ఈ అంశంపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని.. వైసీపీ వాళ్లు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని పార్టీ శ్రేణులను కోరారు. వారాహి యాత్రపైకి రాళ్లతో ఎవరైనా దాడులకు వస్తే వారిపై దాడి చేయవద్దని పట్టుకుని పోలీసులకు అప్పగించాలన్నారు. పెడనలో రెండు, మూడు వేల మంది రౌడీముకలు రాళ్ల దాడుల కోసం వచ్చే అవకాశం ఉందన్నారు. పెడనలో జరిగే పరిణామాలకు ప్రభుత్వం, డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పులివెందుల రౌడీయిజం చేయాలని చూస్తే  ఊరుకోమని ఈ అంశంపైతమకు స్పష్టమైన  సమాచారం ఉందన్నారు.  జగన్ రెడ్డి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే భవిష్యత్‌లో దారుణమైన పరిస్థితులు ఉంటాయని గుర్తుంచుకోవాలని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. అవనిగడ్డలో బహిరంగసభ తర్వాత రెండు రోజుల పాటు మచిలీపట్నం కేంద్రం జనవాణి కార్యక్రమంతో పాటు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఇవాళ పెడన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా జోగి రమేష్ ఉన్నారు. జోగి రమేష్ గతంలో తన అనుచరులందర్నీ తీసుకుని నేరుగా చంద్రబాబు ఇంటిపైకే దాడికి వెళ్లారన్న ఆరోపణలు  ఉన్నాయి. ఆ తర్వాతే ఆయనకు మంత్రి పదవి లభించింది. పవన్ కల్యాణ్‌పై దురుసుగా మాట్లాడేవారిలో జోగి రమేష్ కూడా ఒకరు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్