మహబూబాబాద్ జూలై 28. వాయిస్ టుడే ప్రతినిధి. *అంధుని జీవితానికి పోలీసుల ఆసరా…!!*
*నిలువనీడలేని కుటుంబానికి ఇల్లు కట్టించి ఇచ్చిన మానవత్వం…*
*ఖాకీ దుస్తుల్లో ఉన్న కరుణామూర్తులంటూ ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, పోలీస్ అధికారులకు స్థానిక ఎస్సై కి చేతులు జోడించి మొక్కిన నిరుపేద కుటుంబం..*
*మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామంలో మందుల నాగన్న అనే అంధుడు తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు.కంజర కొడుతూ, పాటలు పాడుతూ యాచకవృత్తితో నాగన్న జీవించేవారు. కంటిచూపు లేకపోవడంతో తల్లిదండ్రుల తోడుగా యాచిస్తూ జీవించేవాడు. పెద్దనాగారంలో నిలువనీడ కూడా లేకపోవడంతో ఓ..ప్లాస్టిక్ పట్టా కట్టుకొని ఎండకుఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ దయనీయంగా జీవించేవాడు.*
*నర్సింహులపేట ఎస్ఐ గండ్రాతి సతీష్ ద్వారా ఈ..విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా పోలీస్ బాస్ సుధీర్ రాంనాద్ కేకన్ మానవత్వంతో స్పందించారు. నిలువనీడలేని ఆ..అంధుని కుటుంబానికి పోలీసులే ఆసరాగా మారాలనే ఆలోచనతో ముందుకు సాగారు*
*_ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ మంచి మనసులో పుట్టిన ఆలోచన స్థానిక ఎస్సై సహకారంతో ఆచరణలోకి వచ్చింది.., ప్లాస్టిక్ కవర్ నీడలో బ్రతుకొక నరకంగా గడిపిన ఆ..కుటుంబానికి భరోసా లభించింది.కనీసం వారు కలలో కూడా ఊహించుకోనట్లుగా పక్కాగృహాన్ని పోలీస్ శాఖ స్వయంగా నిర్మించి బహుమతిగా ఇచ్చింది.*
*_మహబూబాబాద్ జిల్లాఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ స్వయంగా పెద్దనాగారం వచ్చి అంధుడు మందుల నాగన్న తో కలిసి ఇంటిని ప్రారంబించారు._*
*కుచేలుని ఇంటికి ఆ..శ్రీకృష్ణుడు కదిలివచ్చినట్టుగా..!!* *కంటిచూపులేని, నిలువనీడైనాలేని ఓ..కఠికదరిద్రుని ఇంటికి జిల్లాపోలీస్ బాస్ కదిలిరావడం.. కానుకగా ఏకంగా ఓ..ఇంటినే బహుమతిగా ఇవ్వడంతో ఆ..కుటుంబం ఆనందబాష్పాలతో తడిసి ముద్దయ్యింది..* *మహబూబాబాద్ జిల్లాఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ లోని మానవీయకోణాన్ని, ఎస్పీ దిశా నిర్ధేశకత్వంలో జిల్లాపోలీస్ ల పనితీరును ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.శభాష్ మహబూబాబాద్ పోలీస్ అంటూ అభినందనలతో ముంచెత్తుతున్నారు..