బీష్మపితామహుడు వాజ్ పేయి
కోరుట్ల
భీష్మ పితామహుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అని భారతీయ జనతా పార్టీ పలువురు నాయకులు ఆన్నారు.. సోమవారం మాజీ ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా పట్టణ
రాంనగర్ ఏరియా లోని అటల్ బీహార్ వాజ్ పేయి విగ్రహానికి బీజేపీ కౌన్సిలర్ మాడవెణీ నరేష్
పూలమాలవేసి నివాళులు అర్పించారు..ఆనంతరం
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీ స్త్రీలకు పాలు, పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు..
పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతరత్న రాజకీయ చాణీక్యుడు నేటి రాజకీయ తరానికి భీష్మ పితామహుడు అటల్ బిహారి వాజ్ పేయి అన్నారు. ఆయన పాలనలో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్లిందన్నారు..
భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి అందరికీ ఆదర్శనీయమని అన్నారు. దేశ అభివృద్ధికి అటల్ బిహారీ జీ చేసిన సేవలు ఎనలేనిమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పీసరి నర్సయ్య, జిల్లా అధికార ప్రతినిధి తిరుమల వాసు, కోరుట్ల పట్టణ బిజెపి నాయకులు రుద్ర శ్రీనివాస్, పట్టణ మాజీ అధ్యక్షులు చిరుమల్ల ధనుంజయ్, గిన్నెల అశోక్, ఆకుల రంజిత్, బింగి వెంకటేష్, ఓం ప్రకాష్, దామ రాజేష్, ఎర్ర రాజేందర్, కంటముఉదయ్, వల్లోజి నగేష్, నారవేణి అశోక్, ముల్క ఆంజనేయులు, గోపాల్, మేకల గణేష్, గుగ్గిళ్ళ అశోక్, దుర్గాప్రసాద్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి సాడిగే మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు చెట్లపేల్లి సాగర్, ఐటి సెల్ ఇట్యాల నవీన్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి గోనెల రాజశేఖర్, గుండేటి సాయి, ఉపాధ్యక్షులు కంఠం శ్రీనివాస్ దమ్మ సంతోష్ రెడ్డి, రాగం శెట్టి సాయి, తదేల ప్రశాంత్, పంబాల్ల అజయ్, గుండేటి శివ, మైనార్టీ నాయకులు తహేర్, చాంద్ పాషా, తదితరులు పాల్గొన్నారు.



