- Advertisement -
ఖమ్మం: పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తరపున ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేశ్వరికి ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ ప్రతులు అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, జిల్లా నాయకులు బైరు హరినాథబాబు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొడ్డు బొందయ్య, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడిత్యా పెట్రామ్ నాయక్ ఉన్నారు.
- Advertisement -