Sunday, September 8, 2024

పొన్నం వర్సెస్ కౌశిక్

- Advertisement -

పొన్నం వర్సెస్ కౌశిక్,,,
కరీంనగర్, జూలై 8,
రీంనగర్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మధ్య పొలిటికల్ వార్ పతాకస్థాయికి చేరింది. రెండు నెలలుగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత దూకుడు పెంచిన కౌశిక్ రెడ్డి… రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా… తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. ఏకంగా ఓ బ్లాక్ బుక్ రాస్తున్నానంటూ కాంగ్రెస్ నేతలకు వార్నింగ్‌లు ఇస్తున్నారు.ఇక కాంగ్రెస్ చేజార్చుకున్న హుజురాబాద్‌లో పాగా వేసేందుకు మంత్రి పొన్నం సపోర్ట్‌తో హస్తం నేతలు జోరు చూపిస్తున్నారు. దీంతో తన నియెజకవర్గంలో ఇన్వాల్వ్ అవుతున్నాడనే కారణంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ఫై అటాక్ మొదలు పెట్టారు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి. కౌశిక్ నేరుగానే పొన్నంపై ఎటాక్ చేస్తుండగా, మంత్రి పొన్నం మాత్రం ఎక్కడా చలించడంలేదు. కౌశిక్‌కు కౌంటర్‌గా కాంగ్రెస్ ద్వితీయశ్రేణి నేతలతో మాటల దాడి చేయిస్తూ తనదైన రాజకీయం చేస్తున్నారు.పొన్నం ప్రభాకర్, కౌశిక్ రెడ్డి ఇద్దరూ ఒకప్పుడు కాంగ్రెస్‌లో కలిసి పనిచేశారు. కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్‌లో చేరి… మొన్నటిదాకా ఎమ్మెల్సీగా…ఇఫ్పుడు ఎమ్మెల్యేగా హుజూరాబాద్ రాజకీయాల్లో దూకుడు మీద సాగుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో ప్రతిపక్ష నేతగా మిగిలిపోయారు. దీంతో ఇప్పుడు ఇద్దరూ బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న కాంగ్రెస్… కౌశిక్‌రెడ్డి విషయంలో రివర్స్‌లో వెళుతున్నట్లు కనిపిస్తోంది. కౌశిక్‌రెడ్డి దూకుడుతో హస్తం హైకమాండ్ హుజురాబాద్‌పై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. పార్టీ ఆదేశాలతో హుజురాబాద్లో మంత్రి పొన్నం జోక్యం పెరిగింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కౌశిక్ రెడ్డి… మంత్రిపై వాగ్బాణాలు సంధిస్తున్నారు. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం బూడిద దందాలో పొన్నంకి ముడుపులు ముడుతున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు.దీనికి కౌంటర్‌గా కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ అటాక్ చేస్తున్నారు పొన్నం ఫాలోవర్స్. దీంతో వివాదం కాస్త ముదిరి సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకునే స్థాయికి చేరింది. హుజురాబాద్లో ఒక రోజంతా హడావిడి నడిచింది.ఇక తన నియోజకవర్గంలో విద్యాశాఖ అధికారులతో సమీక్షిస్తే… హాజరైన అధికారులకు డీఈవో నోటిసులివ్వడం, తనపై కేసులు పెట్టడం వెనుక పొన్నం పాత్ర ఉందని మండిపడుతున్నారు కౌశిక్‌రెడ్డి. అదేవిధంగా కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేయడంపైనా వివాదం కోర్టుకెక్కింది. మంత్రి పొన్నం కనుసన్నల్లోనే హుజూరాబాద్ నియోజకవర్గ వ్యవహారాలు నడుస్తుండటం ఎమ్మెల్యేకు మరింత అసంతృప్తికి గురిచేస్తోంది.ఈ కారణంతోనే మంత్రిని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పదేపదే విమర్శల దాడి చేస్తున్నారు. ఐతే ఎమ్మెల్యే ఏం మాట్లాడినా, మంత్రి పొన్నం మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. రాజకీయాల్లో తనకంటే జూనియర్ అయిన కౌశిక్ రెడ్డి ఆరోపణలకు తాను స్పందించకుండా, అనుచరులతోనే కౌంటర్లు ఇప్పిస్తున్నారు. కౌశిక్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చి తన స్థాయిని తగ్గించుకోను అన్నట్లు మంత్రి పొన్నం వ్యవహరిస్తున్నారు. అయితే కౌశిక్ రెడ్డి మాత్రం తగ్గేదే లేదంటూ… మంత్రిపై రోజురోజుకు విమర్శల దాడి పెంచుతున్నారు.ఈ ఎపిసోడ్‌ను పరిశీలిస్తున్నవారు సీనియర్లను టార్గెట్ చేస్తేనే తన పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందనే ఆలోచనే ఎమ్మెల్యే విమర్శల వెనుక ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో సీనియర్ నేత ఈటల రాజేందర్ విషయంలోనూ… ఆ తర్వాత అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా ఇలాగే కౌశిక్ రెడ్డి విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా మొత్తానికి మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా సాగుతున్న పొలిటికల్ ఫైట్ తో కరీంనగర్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్