- Advertisement -
టీ బీసీ జేఏసీ,సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో పూలే వర్ధంతి వేడుకలు.
Poole's death anniversary celebrations under auspices of TBC JAC, Senior Citizens.
జగిత్యాల
టీ బీసీ జేఏసీ,తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.గురువారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా సమావేశ మందిరంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు సందర్భంగా టీ బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు
,సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో టీ బీసీ జేఏసి,సీనియర్ సిటీజేన్స్,పెన్షనర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఆయా సంఘాల ప్రతినిధులు నివాళులర్పించారు.పది మంది నిరుపేద వృద్ధులకు చలికాలం దృష్ట్యా స్వేట్టర్లు,దుప్పట్లు అందించారు. అనంతరం హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ పదేళ్ళ నుంచి బీసీ సంఘాలు ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లు పార్లమెంట్ లో పెట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని,బీసీ లకు అట్రాసిటీ చట్టం వర్తింప జేయాలని ,బీసీ లకు కేంద్రం లో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పూలే స్పూర్తితో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అందేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీ బీసీ జేఏసి ఉపాధ్యక్షుడు సింగం భాస్కర్,సీనియర్ సిటీజేన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరి శెట్టి విశ్వనాథం,కోశాధికారి వి.ప్రకాష్ రావు,,పెన్షనర్స్ జిల్లా సహాయ అధ్యక్షుడు హన్మంత్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్, ఉపాధ్యక్షుడు ఎం.డి.యాకూబ్, జర్నలిస్టు దూడం శ్రీశైలం,బీసీ జేఏసి జిల్లా అధ్యక్షుడు కొండ లక్ష్మణ్, మహిళా జేఏసీ జిల్లా నాయకురాళ్ళు కస్తూరి శ్రీమంజరి, గంగం జలజ,వివిధ సంఘాల ప్రతినిధులు పి.ఆశోక్ రావు,సత్యనారాయణ,యాకూబ్ ,కిషన్ రావు,సూర్యనారాయణ,విట్ఠల్, గంగాధర్,బక్కశెట్టి లక్ష్మి,విజయ, సింగం పద్మ,తదితరులు పాల్గొన్నారు .
- Advertisement -