జిల్లాలో గుంతలు లేని రోడ్లు నిర్మాణ పనులను సంక్రాంతి నాటికి వేగవంతంగా పూర్తి చేయాలి
Pothole-free roads in the district should be completed expeditiously by Sankranti
రోడ్లు మరమ్మతుల పనుల్లో నాణ్యత పాటించాలి :
జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి,
గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన మిషన్ హోల్ ఫ్రీ (గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్) కార్యక్రమoపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఆ దిశగా జిల్లావ్యాప్తంగా గుంతలు లేని రోడ్ల పనులను సంక్రాంతి నాటికి పూర్తిచేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.
గురువారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ అండ్ బి అధికారులు, నేషనల్ హైవే పి డి లు, మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్ లతో మిషన్ హోల్ ఫ్రీ పై సమీక్షించారు.
ఈ సందర్భoగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా గుంతలు లేని రోడ్ల పనులను పూర్తిచేసి పురోగతిలోకి తీసుకురావాలని తెలిపారు. ప్రణాళిక బద్ధంగా రోడ్ల మరమ్మతుల విషయంలో ఎలాంటి అలసత్యం లేకుండా వెంటనే పూర్తి కావాలని తెలిపారు. రహదారుల మరమ్మతులు, అభివృద్ధి పనులకు సంబంధించిన మెటీరియల్ నాణ్యతతో పాటు రహదారులు ఎక్కువ కాలం మన్నేలా నాణ్యత పనులను చేపట్టేలా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.