Sunday, September 8, 2024

సర్వేల కోసం కోట్లు కుమ్మరింపు

- Advertisement -

విజయవాడ, నవంబర్ 24, (వాయిస్ టుడే):  జాతీయ మీడియాల్లో సర్వేలు అనుకూలంగా రావడానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి కొన్ని ఛానళ్లకు అడ్డగోలుగా కోట్లు కట్టబెడుతూ వస్తున్నారు. తాజాగా ఇండియా టుడే కోసం మరో నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలను మంజూరు చేశారు.మీడియా మేనేజ్‌మెంట్‌లో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు, కేసీఆర్‌ను మించిపోయారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రధాని మోదీ తర్వాత మీడియా మేనేజ్‌ చేయడంలో కేసీఆర్‌ ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాను తన గుప్పిట్లో పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. తనకు సొంత ప్రతిక, చానెల్‌ ఉన్నా.. దానిని చూసేవారు, చదివేవారు లేకపోవడంతో తెలుగు మీడియాకు కోట్లు కుమ్మరిస్తూ.. ప్యాకేజీలు ఇస్తూ అనుకూలంగా వార్తలు, కథనాలు రాయించుకుంటారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కూడా కేసీఆర్‌ బాటలోనే ప్రయాణిస్తున్నారు. చూస్తుంటే ఎన్నికల నాటికి కేసీఆర్‌ను మించిపోయేలా కనిపిస్తున్నాడు. జాతీయ మీడియాల్లో సర్వేలు అనుకూలంగా రావడానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి కొన్ని ఛానళ్లకు అడ్డగోలుగా కోట్లు కట్టబెడుతూ వస్తున్నారు. తాజాగా ఇండియా టుడే కోసం మరో నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలను మంజూరు చేశారు. ఈ సొమ్ము విద్యాశాఖది. పిల్లలది. అయినా సరే ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఈ మొత్తం ఇండియాటుడేకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇండియాటుడే ఎడ్యుకేషన్‌ మీద ఓ కాంక్లేవ్‌ నిర్వహిస్తోంది. ఇందులో నాలుగు ప్యానల్‌ డిస్కషన్లను బుక్‌ చేసుకోవడానికి నాలుగు కోట్ల ఇరవై లక్షలు వెచ్చిస్తున్నారు. ఈ ప్యానల్‌ డిస్కషన్లతో ఏమి వస్తుంది.. అసలు అంత అవసరం ఏమిటిం అంటే.. ఏమీ రాదు. జగన్‌ సర్కార్‌కు, వైసీపీపి అనుకూలంగా సర్వేలు వేయడానికి అడ్డగోలుగా అక్రమ మార్గంలో చేసే చెల్లింపులు ఇవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనికి కూడా జగన్‌ ప్రజల డబ్బులే వాడుతూండటం విషాదం.ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే టైమ్స్‌ నౌ, ఎన్డీటీవీలకు ఇమేజ్‌ బిల్డింగ్‌ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారు. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కీలక కాంట్రాక్ట్‌ను టైమ్స్‌నౌ గ్రూపునకు ఇచ్చారు. ప్రతీవాళ్లు.. తాడేపల్లి ప్యాలెస్‌ లో తయారయ్యే ఈటీజీ సర్వేలను నెలకోసారి ప్రసారం చేస్తూంటారు. మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పేరుతో ఇండియాటడే ప్రకటించే సర్వేల్లో.. జగన్‌ రెడ్డికి మంచి ఫలితాలు రావడంలేదు. అందుకే ఈ సారి మరింత ప్రజాధనం పెట్టి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్