Sunday, January 25, 2026

ప్రభాస్ 23 ఏళ్ల రెబల్ స్టార్’డమ్’, “రాజా సాబ్” నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

- Advertisement -

ప్రభాస్ 23 ఏళ్ల రెబల్ స్టార్’డమ్’, “రాజా సాబ్” నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
Prabhas’ 23-year-old Rebel Star ‘Dum’, special poster released from “Raja Saab”
భారతీయ సినిమా కీర్తిని కొత్త శిఖరాలకు చేరుస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం నేటికి 23 ఏళ్లకు చేరుకుంది. ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ జర్నీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఈశ్వర్ తర్వాత వరుసగా ‘రాఘవేంద్ర’, ‘వర్షం’, ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘ఛత్రపతి’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’ ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’, ‘ఏక్‌నిరంజన్‌’, ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘రెబల్‌’, ‘మిర్చి’ వరకు ప్రభాస్ జర్నీ ఒక ఫేజ్ అయితే బాహుబలితో ఆయన పాన్ ఇండియా జర్నీ బిగిన్ అయ్యింది. బాహుబలి రెండు చిత్రాల తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. ప్రభాస్ రెండు సార్లు(బాహుబలి 2, కల్కి 2898 ఎడి) వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ సినిమాలను ఖాతాలో వేసుకోవడం ఒక రేర్ రికార్డ్. ఓవ‌ర్‌సీస్ మార్కెట్‌లో ప‌ది మిలియ‌న్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించిన తొలి హీరోగా ప్ర‌భాస్‌ నిలిచారు.
ప్రభాస్ తొలి సినిమా “ఈశ్వర్” 2022, నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రోజును రెబల్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కు స్పెషల్ డేగా గుర్తుంచుకుంటారు. రెబల్ స్టార్ నట ప్రస్థానం 23 ఏళ్లకు చేరుకున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ ఆయన కొత్త సినిమా “రాజా సాబ్” నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో సరికొత్త మేకోవర్ లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు. ప్రభాస్ కెరీర్ లో మరో ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న “రాజా సాబ్” సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ…ప్రభాస్ చేస్తున్న హ్యూజ్ ప్రాజెక్ట్స్. వీటితో పాటు వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించనున్న కల్కి 2 కూడా ప్రభాస్ లైనప్ లో ఉంది. ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టించబోతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్