Sunday, September 8, 2024

ప్రభాస్ టార్గెట్  350 కోట్లు

- Advertisement -

ప్రభాస్ టార్గెట్  350 కోట్లు

హైదరాబాద్, డిసెంబర్ 20

బాహుబలి’తో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా రేంజ్ వంద కోట్లు దాటింది. ‘బాహుబలి’ మొదటి భాగం డిస్ట్రిబ్యూషన్ హక్కులను సుమారు రూ. 120 కోట్లకు విక్రయించారు! ఆ తర్వాత ప్రభాస్ సినిమా ప్రీ రిలీజ్

బిజినెస్ ఎప్పుడూ రూ. 200 కోట్లకు తగ్గలేదు. ప్రతి సినిమాకు రేంజ్ పెరుగుతూ వెళుతోంది. ప్రభాస్ లేటెస్ట్ సినిమా ‘సలార్’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమాను ఎన్ని కోట్లకు అమ్మారు? వంటి

వివరాల్లోకి వెళితే…
‘సలార్’ వరల్డ్ వైడ్ రైట్స్ @ 345 కోట్లు!
మీరు చదివింది నిజమే! అక్షరాల… మూడు వందల నలభై ఐదు కోట్లకు ‘సలార్’ డిస్ట్రిబ్యూషన్ హక్కులను అమ్మారు. ఏపీ, తెలంగాణ… తెలుగు

రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 144 కోట్లు! ‘సలార్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏయే రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు పలికాయి? అనేది చూస్తే…
నైజాం (తెలంగాణ) – రూ. 60 కోట్లు
ఆంధ్ర (అన్ని ఏరియాలు) –

రూ. 60 కోట్లు
సీడెడ్ (రాయలసీమ) – రూ. 24 కోట్లు
ఏపీ & తెలంగాణ కలిపితే… రూ. 144 కోట్లు
ఓవర్సీస్ (విదేశాల్లో) – రూ. 70 కోట్లు
కర్ణాటక – రూ. 30 కోట్లు
నార్త్ ఇండియా (హిందీ) – రూ. 75

కోట్లు
రెస్టాఫ్ ఇండియా – రూ. 3 కోట్లు
కేరళ (మలయాళం) – రూ. 6 కోట్లు
తమిళనాడు – రూ. 12 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా ‘సలార్’ చిత్రాన్ని 345 కోట్ల రూపాయలకు అమ్మారు. ఇంచు మించు ‘బాహుబలి

2’ రేంజ్ అన్నమాట! ఆ సినిమా కంటే రూ. 7 కోట్లు తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  ఇప్పుడు థియేటర్ల నుంచి ‘సలార్’ సినిమా మినిమమ్ రూ. 350 కోట్లు కలెక్ట్ చేస్తే గానీ బ్రేక్ ఈవెన్ కాదని ట్రేడ్

వర్గాలు చెబుతున్నాయి. ‘సలార్’ రెండో ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచింది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ మంచి జోరు మీద ఉన్నాయి. ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే… ఆ మాత్రం కలెక్ట్ చేయడం

పెద్ద కష్టం ఏమీ కాదని చెప్పాలి. హిట్ టాక్ వస్తే… దానికి డబుల్ కలెక్ట్ చేస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం అవసరం లేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్