Tuesday, March 3, 2026

గ్రూప్‌-2తోపాటే 3 పరీక్షలకు కసరత్తు

- Advertisement -

గ్రూప్‌-4 పరీక్ష ఇప్పటికే జరగ్గా.. గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఇక.. గ్రూప్‌-3 పరీక్ష తేదీని ప్రకటించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో త్వరలోనే గ్రూప్‌-2తోపాటు గ్రూప్‌-3 పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించాలని టీఎస్‌పీఎస్సీ యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. టీఎస్‌పీఎస్సీపై తాజాగా సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి కమిషన్‌ను ప్రక్షాళన చేస్తామని ప్రకటించడం, కమిషన్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి సహా సభ్యులు రాజీనామాకు సిద్ధపడటం చూస్తుంటే.. రాష్ట్రంలో గ్రూప్‌-2 పరీక్షలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన గ్రూప్‌-2 పరీక్ష.. షెడ్యూల్‌ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరుగడం కష్టమేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.తాజా పరిస్థితుల నేపథ్యంలో మూడోసారి రీ షెడ్యూల్‌ చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రంలో గ్రూప్‌-2 క్యాటగిరీ కింద 18 విభాగాల్లో 783 పోస్టుల భర్తీకి గత డిసెంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 5,51,943 మంది దరఖాస్తు చేశారు. సగటున ఒకో ఉద్యోగానికి 705 మంది పోటీలో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లోనే నిర్వహించాల్సి ఉండగా, అదే నెలలో మరికొన్ని పరీక్షలు ఉండటంతో పరీక్షను వాయిదా వేసి, మరికొంత సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరారు. పరీక్షను వాయిదా వేసిన కమిషన్‌.. నవంబర్‌ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈలోపే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో మరోమారు వాయిదా పడింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్