విశాఖపట్నం:అక్టోబర్ 09: తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. సోమవారం నాడు విశాఖపట్నంలోఅయన పర్యటించారు.. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణ ఎన్నికలో మా పార్టీ నుంచి 119 మంది అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. కులమతాలకు అతీతంగా ఎన్నికల్లో గెలిచి అభివృద్ధి చేస్తాను. నేను దేశం, మన తెలుగు రాష్ట్రాలను కాపాడుకుంటున్నాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి రూపాల స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటు పరం చేయకుండా ఆపేశారు. ఏపీలో బీజేపీ పార్టీ లేదు. ఇజ్రాయెల్, పాలస్తీనల గొడవలు ఆగిపోవలని దేవుడికి ప్రార్థన చేశా. శాంతి కోసం మీరందరు కూడా ప్రార్థన చేయాలి. డిసెంబర్10 తేదీన ప్రపంచ గ్లోబల్ క్రిస్మస్ వేడుకలు చేస్తున్నాం. గ్లోబల్ క్రిస్మస్ వేడుకలకు 5 వేల మందిని ఆహ్వానిస్తున్నాం. డిసెంబర్ 10వ తేదీన ఇక్కడ నుంచే 200 దేశాలకి శాంతి సందేశం ఇస్తాను’’ అని కేఏ పాల్ పేర్కొన్నారు.