Thursday, March 26, 2026

మళ్లీ రంగంలోకి ప్రశాంత్ కిషోర్

- Advertisement -

మళ్లీ రంగంలోకి ప్రశాంత్ కిషోర్
గుంటూరు, మార్చి 24(వాయిస్ టుడే )

Prashant Kishor Back in the Fray
2019 ఎన్నికల్లో వైసీపీ సాధించిన ప్రభంజన విజయంలో ప్రశాంత్ కిశోర్  వ్యూహాలు ఎలా సక్సెస్ అయ్యాయో రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. అయితే ‘రావాలి జగన్ – కావాలి జగన్’ నినాదం అప్పట్లో ఏపీని ఊపేసింది. ఊరూరా వైసీపీ జెండా రెపరెపలాడిండి. అయితే 2024 ఎన్నికల సమయంలో మాత్రం వైసీపీ చతికిలపడింది. ఇందుకు పీకే దూరమవ్వడమే కారణం. కేవలం ఐప్యాక్ (I-PAC) టీమ్‌తోనే జగన్ ఎన్నికలకు వెళ్లడంతో అత్యంత దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకున్నారు. జగన్ 175 అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే ఇప్పుడు పార్టీని మళ్ళీ గాడిలో పెట్టేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారు. తన పాత మిత్రుడు పీకే వైపు చూస్తున్నట్లు పొలిటికల్స్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.కాగా 2024 ఎన్నికల ఫలితాలకు ముందు ప్రశాంత్ కిషోర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు ఆ అంచనాలే నిజం అయ్యాయి. దీంతో వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలతో జగన్ ప్రజల్లోకి వెళ్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడంలేదని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీకే వంటి బలమైన వ్యూహకర్త మళ్లీ అవసరమని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు 2029 లక్ష్యాన్ని ఛేదించేందుకు మూడేళ్ల ముందే నుంచి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని, ఇందులో భాగంగానే పీకేతో జగన్ సంప్రదింపులు చేస్తున్నారనే ప్రచారం రాష్ట్రంలో జోరుగా జరుగుతోంది.ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ బీహార్‌లో జన్ సూరాజ్ పార్టీ పెట్టి ఆ ప్రయాణంలో బిజీగా ఉన్నారు. గతంలో ఆయన ‘నేను వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నాను’ అని ప్రకటించారు. కానీ జగన్‌తో ఉన్న పాత పరిచయం కారణంగా వీరి కలయిక మళ్లీ సాధ్యమేననే విశ్లేషణలు జరుగుతున్నాయి. ఐప్యాక్ టీమ్ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పని చేస్తే మళ్లీ విజయవంతమైన ఫలితాలు ఉంటాయని, అటు క్యాడర్‌లోనూ కొత్త ఉత్సాహం వస్తుందని వైసీపీ అగ్రనేతలు భావిస్తున్నారని తెలుస్తోంది.రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే సామెత ఉండనే ఉంది. ఈ ప్రకారం జగన్, పీకే మళ్ళీ చేతులు కలిపితే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరగుతాయి. 2024 ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న జగన్.. మళ్లీ పీకే సలహాలు తీసుకుని సరికొత్త ‘జగన్ 2.0’ వ్యూహాన్ని ఎలా అమలు చేస్తారో చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్