వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
:
సిద్దిపేట
జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హీట్ రిలేటెడ్ ఇళ్ళనేస్ ఎండ తీవ్రతతో వచ్చే ఆరోగ్య సమస్యల పైన, జిల్లాల అధికారుల సమన్వయ సమావేశాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పల్వాన్ కుమార్ తో కలిసి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి అడిషనల్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలకు ప్రస్తుతం ఎండలు వీస్తున్న సమయంలో ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా, ముందస్తుగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు.
వడదెబ్బ ఎలా వస్తుంది:
తీవ్రమైన ఎండ, వడ గాల్పులు వీస్తున్న సమయంలో ప్రయాణం చేసిన, ఎండలో పని చేసిన వడదెబ్బ తగులుతుంది.
వడదెబ్బ లక్షణాలు:
తీవ్రమైన తలనొప్పి.
నాలిక ఎండిపోవడం
నాడీ వేగంగా కొట్టుకోవడం.
అధిక దాహం
శరీరంలో నీరు కోల్పోవడం,
వాంతులు విరోచనాలు
పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మార్క స్థితి.
ప్రధమ చికిత్స:
వడదెబ్బకు గురైన వ్యక్తిని నీడ ప్రదేశానికి చేర్చాలి.
శరీరాన్ని చల్లటి నీటిలో ముంచిన గుడ్డతో శరీరం తుడవాలి.
వడదెబ్బకు గురి అయిన వ్యక్తికి మజ్జిగ, నిమ్మరసం,కొబ్బరి నీళ్లు, లేదా ఓఆర్ఎస్ ద్రావం లేదా ఉప్పు పంచదార తో కలిపిన నీటిని త్రాగించాలి.
ప్రధమ చికిత్స చేసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి పల్లె, బస్తి దవాఖాన లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఎండ తీవ్రత ఉన్నప్పుడు బయట తిరగకుండా ఉండడము, ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బయటకు వెళ్లినప్పుడు తలకు టోపీ, గొడుగు, రుమాల్ సహాయం తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణం చేసినప్పుడు మజ్జిగ నిమ్మరసం, ఓఆర్ఎస్ వెంట తీసుకువెళ్లాలి. ముఖ్యంగా పిల్లలు ఎండ తీవ్రత ఉన్నప్పుడు బయటకు వెళ్లడం, గాని ఆడుకోవడం గానీ చేయకుండా ఉండాలి, పిల్లలు నీడ ప్రదేశంలో ఆడుకోవడం మంచిది.
ఆరు నెలలోపు శిశువులకు కేవలం తల్లిపాలు మాత్రమే త్రాగించాలి. సాధ్యమైనంత వరకు కాటన్ దుస్తులు ధరించడం మంచిది. నీరు మరియు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఇంటిలోనికి వడగాల్పులు, ఎండ తీవ్రత రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆరోగ్య సిబ్బందికి తగు సలహాలు సూచనలు:
క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, వడదెబ్బ గురి అయిన వ్యక్తినీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చికిత్స అందించాలని, కావలసిన మందులన్నీ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పల్లె దాకాల్లో బస్తీ దాకాలో అందుబాటులో ఉంచుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన అవగాహన కల్పించాలని ఆదేశించారు.