తిరుపతి: శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం నా పూర్వజన్మ సుకృతం అని చంద్రగిరి ఎమ్మెల్యే టిటిడి బోర్డు మెంబర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు గజవాహనాన్ని పురస్కరించుకొని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రగా పద్మావతి అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. తుమ్మలగుంట,గాంధీ పురం అవిలాల,లింగేశ్వర నగర్,శ్రీనివాస పురం పద్మావతి పురం మీదుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకునన్నారు. తిరుచానూరు సింధు ఫ్లై ఓవర్ వద్ద తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి ఘన స్వాగతం పలికారు.పాదయాత్రలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అడుగడుగునా వైసీపీ ముఖ్య నాయకులు స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న అనంతరం ఒక సామాన్య భక్తుడిలా తన అనుచర గణంతో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తన మ్రొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని పద్మావతి అమ్మవారిని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి,చెవిరెడ్డి హర్షిత రెడ్డి, పరాసరేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి తిరుచానూరు ఎంపీటీసీ నరేష్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి బ్రాహ్మణ పట్టు ఎంపీటీసీ యోగానంద రెడ్డి వార్డు మెంబర్లు,ఆర్.ఆర్.యూత్ తదితరులు పాల్గొన్నారు.




