- Advertisement -
ఈ నెల 8 న ప్రధాని మోడీ విశాఖ రాక
Prime Minister Modi's arrival in Visakhapatnam on 8th of this month
విశాఖపట్నం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖ రానున్నారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ విశాఖలో ఉంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఎన్‌టీపీసీ నిర్మించనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటుకు శంకుస్థాపన, రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే కార్యక్రమాలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.మోదీ పర్యటన నేపద్యంలో అధికారులతో కలసి సమీక్ష నిర్వహించినట్లు అనకాపల్లి ఎంపి సిఎం రమేష్ తెలిపారు.
- Advertisement -