ప్రధాని మోడీ విధానాలు మార్చుకోవాలి
పెద్దపల్లి
ప్రధాని మోడీ తన పరిపాలనా విధానాలు మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మార్చేడేనని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. కార్మిక, ఉద్యోగ సంఘాల జిల్లా సదస్సు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న ఎఐటియుసి, సిఐటియు, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, టిఎన్టియుసి, ఏఐఎఫ్టియు సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు కడారి సునీల్, ఎరవెల్లి ముత్యంరావు, రమేష్, కే.విశ్వనాథం, బి.అశోక్, తోకల రమేష్, కంది చంద్రయ్య, రాములు మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఈనెల 16న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దె దింపేందుకు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పేద, సామాన్య, ప్రజానీకం సిద్ధం కావాలని కోరారు. కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేయరాదని, వ్యవసాయ రంగాన్ని కార్పోరేటర్లకు అప్పజెప్పే విధానం మానుకోవాలని హితవు పలికారు. ఈ సదస్సులో వివిధ సంఘాల నాయకులు వేల్పుల కుమారస్వామి, జి. సత్యనారాయణ రెడ్డి, సతీష్, ఎస్. రవీందర్, భీమయ్య, ఎరవెల్లి ముత్యంరావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోడీ విధానాలు మార్చుకోవాలి
- Advertisement -
- Advertisement -