హైదరాబాద్:నవంబర్ 07: ఎన్నికల సభ నిర్వహించే నేపథ్యంలో ప్రధాని మోడీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగే బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని ఇటీవల అమిత్ షా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సభలో ప్రధానితో పాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వేదిక పంచుకోనున్నారు. ఇక ఈ నెల 11న ప్రధాని మోడీ మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ఎస్సీ అణగారిన వర్గాల సభలో ప్రధాని పాల్గొననున్నారు.
మోడీ షెడ్యూల్
ఈరోజు సాయంత్రం 5.05 గంటలకు యూపీ ప్రయాగ్ రాజ్ నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ కు మోడీ చేరుకుంటారు. 5.10 గంటలకు అక్కడి నుంచి బయలు దేరి 5.25కు ఎల్బీ స్టేడియం చేరుకుంటారు. 5.30 నుంచి 6.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 6.15 గంటలకు బయలు దేరి బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ తిరుగు పయనమవుతారు…



