- Advertisement -
రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని హామీ
న్యూఢిల్లీ డిసెంబర్ 7: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయనకు కంగ్రాట్స్ తెలిపారు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని హామీ ఇస్తున్నట్లు ప్రధాని తన ట్వీట్‌లో తెలిపారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి హిమాచల్, కర్నాటక సీఎంలు, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
- Advertisement -