తిరుపతిలో ఘనంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు…
Prime Minister Narendra Modi's birthday celebrations in Tirupatiతిరుపతి
దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలను చేపట్టి, ప్రపంచ శక్తిగా భారత్ ను తీర్చిదిద్దడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశ ప్రజల ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు మెండుగా ఉన్నాయి అని
కస్తూరి బా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ చైర్మన్ డా.పి.సి.రాయులు అన్నారు.ఆయన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పేదలకు అన్నదానం, వస్త్రదానం చేశారు…
కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, టీటీడీ బోర్డ్ మాజీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి హాజరయ్యరు.
సందర్భంగా పీ.సి. రాయులు మాట్లాడుతూ
ప్రధాని మోడీ సరికొత్త పథకాలతో దేశ ప్రజలకు చేరువవుతున్నారు అన్నారు.
ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధి లక్ష్యంగా పయనిస్తూ మరోపక్క భారతదేశాన్ని, ప్రపంచంలోనే సూపర్ పవర్ గా నిలపడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు అని కొనియాడారు
ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి ,టీటీడీ బోర్డ్ మాజీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.




