ఎల్బీనగర్ లో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం
ఎల్బీనగర్, వాయిస్ టుడే: ఎల్బీనగర్ నియోజకవర్గ తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎస్.కె.గార్డెన్స్ లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక… రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు పెద్దపీట వేసిందని తెలిపారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతిఒక్క ఉద్యమకారునికి పార్టీలో ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. మొదటి విడత దళితబంధులో సుమారు 11 మంది ఉద్యమకారులకు దళితబంధు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. రెఙడో విడతలో మరో 120 మందికి దళితబంధు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యమకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రూబీ స్టీవెన్ సన్, ప్రధాన కార్యదర్శి తెలంగాణ వెంకన్న, తెలంగాణ ఉద్యమ నేతలు కాచం సత్యనారాయణ గుప్త, కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు విజయానంద్, స్టీరింగ్ కమిటీ సభ్యులు మియాపూరం రమేష్, సుర్వి రాజు గౌడ్, సతీష్ యాదవ్, బీరెల్లి వెంకటరెడ్డి, యుగంధర్ శర్మ, రుద్రాల స్వామి, డబ్బికార్ మధు, ఆడాల యాదయ్య, శ్యాంయాదవ్, ఉద్యమకారులు పాల్గొన్నారు.