
కాంగ్రెస్ లో చేరిన యువకులు
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
కాంగ్రెస్ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్య ఇస్తుందని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నారు. మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కొత్తపేటలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఇస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని సూచించారు. పార్టీలో చేరిన యువకులకు మధుయాష్కి గౌడ్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు