Thursday, April 24, 2025

 ఇన్ స్టా రీల్స్ చేస్తూ దొరికిన ఖైదీ

- Advertisement -

 ఇన్ స్టా రీల్స్ చేస్తూ దొరికిన ఖైదీ
హైదరాబాద్, ఏప్రిల్ 15

Prisoner caught making Instagram reels

హైదరాబాద్‌లోని చంచల్‌గూడా జైలులో ఉన్న ఓ రిమాండ్ ఖైదీ హ్యాపీగా ఇన్‌స్టా రీల్స్ చేయటమే అందుకు కారణం. ఇందుకు జైలులో భద్రతా లోపాలు కూడా ఓ కారణమనుకోండికొద్ది రోజుల క్రితమే నకిలీ బెయిల్‌ పత్రాలతో ఓ ఖైదీ విడుదలైన ఘటన మరువకముందే.. చంచల్ గూడా జైలులో తాజాగా రిమాండ్‌లో ఉన్న ఖైదీ ఒకరు ములాఖత్ సమయంలో ఏకంగా సోషల్ మీడియాలో లైవ్ రీల్స్ చేయడం సంచలనం రేపుతోంది. ఈ ఘటన జైలు భద్రతతో పాటు, పోలీసు యంత్రాంగం యొక్క నిఘా వ్యవస్థను సైతం ప్రశ్నిస్తోంది. గతంలో ములాఖత్‌కు వచ్చిన సందర్శకులు ఖైదీలకు రహస్యంగా గంజాయి, సిగరెట్లు వంటి నిషేధిత పదార్థాలు అందించిన ఉదంతాలు వెలుగు చూసినప్పటికీ, జైలు లోపల సెల్‌ఫోన్‌తో వీడియోలు తీయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.జైళ్ల శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. పహాడీషరీఫ్‌లోని షాహిన్‌నగర్‌కు చెందిన మహమ్మద్‌ అహ్మద్‌-బిన్‌-హసన్‌ అలీ జాబ్రీ అనే 24 ఏళ్ల వ్యక్తిని బెదిరింపు కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి, అనంతరం చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి, ఈ నెల 12న (శుక్రవారం) జాబ్రీని చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో రిమాండ్‌కు తరలించారు.మరుసటి రోజు (శనివారం), జాబ్రీని కలిసేందుకు అతని స్నేహితులు జైలుకు వచ్చారు. జైలు నిబంధనల ప్రకారం, ములాఖత్ గదిలోకి సెల్‌ఫోన్‌లు గానీ, మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. ఖైదీలు ఒక గాజు గోడ అవతల ఉండగా, వారి బంధువులు, స్నేహితులు ఇటువైపు నుంచి ఇంటర్‌కామ్ ఫోన్ ద్వారా మాత్రమే మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అయితే, జాబ్రీ స్నేహితులు నిబంధనలను ఉల్లంఘించి రహస్యంగా సెల్‌ఫోన్‌ను లోపలికి తీసుకువెళ్లారు. దానితో జాబ్రీ వీడియోను చిత్రీకరించి, అతని సోషల్ మీడియా ఖాతాలో (సుమారు 10 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు) అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో జాబ్రీ ముఖంలో కొంచెం కూడా బాధగానీ, పశ్చాత్తాపం గానీ కనిపించకపోగా.. హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుండటం గమనార్హం.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ నెల 15న (సోమవారం) జైళ్ల శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే జాబ్రీ స్నేహితులు ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించారు. అయితే, పోలీసులు ములాఖత్ రిజిస్టర్‌లోని వివరాల ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఆ సమయంలో ములాఖత్ హాలు వద్ద విధుల్లో ఉన్న ఇద్దరు సిబ్బందికి జైళ్ల శాఖ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
విశేషమేమిటంటే.. 24 ఏళ్ల వయస్సు ఉన్న జాబ్రీ చూడటానికి 17 ఏళ్ల యువకుడిలా కనిపిస్తాడు. అతనిపై గతంలోనూ బెదిరింపులు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తాజా ఘటన చంచల్‌గూడ జైలు భద్రతా వ్యవస్థపై విమర్శలకు తావిస్తోంది. ఉన్నత స్థాయి అధికారులు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్