ప్రియాంక సభకు టీడీపీ శ్రేణులు

- Advertisement -

ఖమ్మం, నవంబర్ 25, (వాయిస్ టుడే):  ఖమ్మంలో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆమె ప్రచారానికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. అదేదో నాలుగైదు జెండాలు కాదు… కాంగ్రెస్ జెండాలను డామినేట్ చేసేలా పసుపు జెండాలు ప్రత్యక్షమయ్యాయి. అంతే కాదండోయ్.. డ్రమ్స్ చప్పుళ్లకు డ్యాన్సులు వేస్తూ పెద్ద కోలాహలమే చేశారు తెలుగు తమ్ముళ్లు. కాగా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు.. బహిరంగంగానే టీడీపీ మద్దతు కోరుతున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని.. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానంటున్నారు.  కాగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని టీడీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కానీ టీడీపీ శ్రేణులు మాత్రం పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దుతుగా ర్యాలీలు, సభల్లో పాల్గొంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular