శిల్పా వెంచర్స్ నిర్వాహకులపై చర్యలు
ఆళ్ళగడ్డ
Proceedings against the administrators of Shilpa Ventures
ఆళ్ళగడ్డ లోని పురపాలక సంఘ భవనంలో మున్సిపల్ ఛైర్మన్ డా. రామ లింగారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ హాజరయ్యారు.
ఎమ్మెల్యే అఖిల ప్రియ అధికారులు , కౌన్సిలర్లతో కలిసి ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన , నిలిచిన అభివృద్ధి , కాలనిలలో రోడ్లు , డ్రైనేజీ , స్ట్రీట్ లైట్లు , పారిశుధ్యం తదితర అంశాలపై చర్చించారు. నిలిచిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆళ్ళగడ్డ పట్టణంలో ఇప్పటికీ ఉన్న అన్నా క్యాంటీన్ ను త్వరలో పునరుద్ధరణ చేస్తామని అలాగే మరొక అన్నా క్యాంటిన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమణకు గురైన కెనాల్ కాలువ ను పరిశీలించడం జరిగిందని ఎమ్మెల్యే అఖిల ప్రియ అన్నారు.ప్రభుత్వంచే ఎటువంటి అనుమతులు లేకుండా కాలువను ఆక్రమించిన శిల్పా వెంచర్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అఖిల ప్రియ అన్నారు.




