- Advertisement -
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే పింఛన్లు పెంపు
Promise in Elections-Increase in pensions
నర్సీపట్నం
నర్సీపట్నం మండలం, ధర్మసాగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు అమలవుతుందని తెలిపారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ, పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని, సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పంపిణీ చేశామన్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకే 80 శాతం పింఛన్లు పంపిణీ చేశామని, కొత్తగా అర్హులైన వారికి అక్టోబరు నుంచి పింఛన్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
అనర్హులైన వారిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, డ్వాక్రా గ్రూపు మహిళలందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గ్రామాలన్నీ శుభ్రం చేసే కార్యక్రమం ప్రతీ గ్రామం లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -