గచ్చిబౌలి హోటల్‌లో విదేశీ మహిళలతో వ్యభిచారం.. ముఠా అరెస్ట్

- Advertisement -

గచ్చిబౌలి హోటల్‌లో విదేశీ మహిళలతో వ్యభిచారం.. ముఠా అరెస్ట్

Prostitution with foreign women at Gachibowli hotel… Gang arrested.

గచ్చిబౌలి, అక్టోబర్ 1 (వాయిస్ టుడే): గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రీమ్ ప్రైడ్ హోటల్‌ను కేంద్రంగా చేసుకుని విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు హోటల్‌పై దాడి నిర్వహించిన పోలీసులు నిర్వాహకులు నిఖిల్, రామ్మోహన్ రెడ్డితో పాటు విటుడు హర్షిత్ సింఘానియాను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ప్రధాన నిర్వాహకుడైన నిఖిల్ ఢిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గచ్చిబౌలిలోని డ్రీమ్ ప్రైడ్ హోటల్‌లో విదేశీ మహిళలను వేర్వేరు గదుల్లో ఉంచి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో పాల్గొంటున్న ముగ్గురు మహిళలు ఉజ్బెకిస్తాన్‌కు చెందినవారిగా గుర్తించారు.
దాడి సమయంలో సంఘటనా స్థలం నుంచి 23 వాడిన కండోమ్స్, రూ.13 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే రామ్మోహన్ రెడ్డి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన విదేశీ మహిళల వద్ద పాస్‌పోర్టులు, వీసాలు చెల్లుబాటులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారు కొద్ది రోజుల క్రితమే ఉజ్బెకిస్తాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి, వ్యభిచార నిర్వహణ వెనుక ఉన్న వ్యక్తులు, మహిళలను హైదరాబాద్‌కు తీసుకువచ్చిన విధానం తదితర అంశాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular