మహిళలకు రక్షణ కల్పించండి

- Advertisement -

మహిళలకు రక్షణ కల్పించండి
వైద్యాధికారి శ్రావణి

Protect Women

సి.బెళగల్
సి.బెళగల్ మండలం పోలకల్ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని శ్రావణి ఆధ్వర్యంలో కోల్కత్తాలోని ప్రభుత్వ వైద్య కళాశాల లో డ్యూటీ లో ఉన్న మహిళా డాక్టర్ అత్యాచారంపై పోలకల్ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శ్రావణి మాట్లాడుతూ మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోయిందని, ఆడపిల్లలపై చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలపై హత్యాచారాలు జరుగుతున్నాయని ,ఇలాగైతే దేశంలో మహిళల మనుగడకు రక్షణ లేకుండా పోతుందని ఆమె తెలిపారు. అనంతరం కోల్కతా లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో డ్యూటీలో ఉన్న మహిళ డాక్టర్ మౌమిత అత్యాచారం చేసి హత్య చేశారు అని,పోలకల్ హాస్పటల్ సిబ్బందితో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణి, హెల్త్ సూపర్వైజర్లు, ఎంఎల్హెచ్పి , ఏఎన్ఎంలు,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular