- Advertisement -
మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ రచ్చ
Protocol fuss during Minister Konda Surekha's visitమెదక్
శనివారం జరిగిన మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. చేగుంట మండలం వడియారం గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ వచ్చారు. స్టేజిపై దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జి చెరకు శ్రీనివాస్ రెడ్డి కూర్చోవడంతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిఅభ్యంతరం తెలిపారు. మంత్రి సూచనతో చెరకు శ్రీనివాస్ రెడ్డి వెనుక వెళ్లి కూర్చున్నారు. చిల్లర పనులు చేయొద్దని విజ్ఞత పాటించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పడంతో వివాదం రాజుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య పోటాపోటీ నినాదాలు చోటు చేసుకున్నాయి. దాంతో సభా ప్రాంగణం రసాభాసగా మారింది.
- Advertisement -




