- Advertisement -
బస్సు సౌకర్యం కల్పించండి,
Provide bus facility
ఆర్టీసీ చైర్మన్ దొన్నుదొర కు వినతి
అరకులోయ
వి.మాడుగుల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ శుక్రవారం ఆ గ్రామ పెద్దలు కామేష్ , ఈశ్వర్ రావు , మల్లిఖార్జున ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సివేరి దొన్నుదొర కు ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మా వి.మాడుగుల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని తమ గ్రామానికి సరైన బస్సు సౌకర్యం లేక వి.మాడుగుల ప్రజలతో పాటు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు అనేక అగచాట్లు పడుతున్నారని తెలిపారు.వి.మాడుగుల పట్టణ పరిధిలోని షెడ్యూల్ పంచాయతీ లు ఉన్నాయని అలాగే నాన్ షెడ్యూల్ పంచాయతీ లు ఉన్నాయని తెలిపారు. అధిక జనాభా ఉన్నారని సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విశాఖపట్నం నుండి పాడేరు, పాడేరు నుండి విశాఖపట్నం, అలాగే చోడవరం , పాడేరు , బస్సులు వి.మాడుగుల మీదుగా వెళ్లేటట్లు చర్యలు తీసుకోవాలని దొన్నుదొర ను కోరారు.సానుకూలంగా స్పందించినా ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ సివేరి దొన్ను దొర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి బస్సు సౌకర్యం ఏర్పాటు కు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమం లో వి.మాడుగుల గ్రామస్తులు.కామేష్ , ఈశ్వర్ రావు , మల్లిఖార్జున రావు పాల్గొన్నారు
- Advertisement -