డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు అందించండి
కమాన్ పూర్
Provide double bedroom houses to deserving people
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఒక్క హైదరాబాదులో 65 వేలు అలాగె రాష్ట్రంలో లక్షలాది డబుల్ బెడ్రూమ్స్ గృహాలను నిర్మించి వృధాగా పక్కకు పెట్టారు ప్రజాధనాన్ని ఈ విధంగా వృధాగా చేయడం సరైనది కాదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టి వాటికి సకల సదుపాయాలు కల్పించి అర్హులకు కేటాయించాలని కేటాయించడమే కాదు వారికి అందజేయాలని న్యూ ఇండియా పార్టీ డిమాండ్ చేస్తుంది బిఆర్ఎస్ పార్టీ వాళ్లు నిర్మించారని మీరు వాటిని అశ్రద్ధ చేయకండి అధి కేసీఆర్ డబ్బు కాదు ప్రజాధనం కావున వెంటనే డబుల్ బెడ్ రూమ్ గృహాలను మెరుగుపరిచి కేటాయించాలని అలా కాకుండా ఇండ్లు పక్కకు వేయడం ఇదే న్యాయమని పక్కకు వేయడం అన్యాయమని మీరు వివక్షకు పోకుండా లిఫ్టు లేకుండా పలు అంతస్తులు నిర్మించడం నేరం పాపం ఆ తప్పు మీరు చేయకండి తప్పులను సరిదిద్ది డబుల్ బెడ్ రూమ్ గృహాలను ఆకర్షనీయంగా అన్ని రకాల వసతులు ఏర్పర్చి సేఫ్టీ గా ఉండేలా తీర్చిదిద్ది అందించాలని లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలు ను ఎదుర్కోవలసి వస్తుందని తెలియజేస్తున్నాము అని డాక్టర్ జెవి రాజు న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ నగర్ లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు అశోకు వేముల జనగామ తిరుపతి గంట భబిత తదితరులు పాల్గొన్నారు.



