పంటల చివరి వరకు సాగు నీరు అందించండి

- Advertisement -

దేవనకొండ:  ఈ యేడాది రైతులు వేసుకున్న పంటలకు చివరి వరకు సాగు నీరు అందించాలని వైయస్సార్ పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు కప్పట్రాళ్ల బొజ్జమ్మ రామచంద్ర నాయుడు మంగళవారం కర్నూలు జిల్లాలోని

 

కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సృజనను కలిసి విన్నవించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యేడాది వర్షాలు లేకపోవడంతో రైతులు తమ పంటలకు చేసుకున్న అప్పులు చెల్లించలేక

 

ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ప్రస్తుతం హంద్రీనీవా నీటిపై ఆధారపడి చాలా మంది రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు.అయితే హంద్రీనీవా ద్వారా నీరు సరఫరా కావడం లేదని ఆవేదనకు వ్యక్తం

 

చేస్తున్నారు.కాబట్టి రైతుల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తమ పంటలు పూర్తి దిగుబడి వచ్చే వరకు హంద్రీనీవా నీటిని విడుదల చేయాలని కోరారు.అందుకు కలెక్టర్ స్పందిస్తూ ఇరిగేషన్

 

అధికారులతో సంప్రదించి రైతులకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular