- Advertisement -
పోలీస్ వాహనాన్ని నడిపి.. సైకో వీరంగం
చిత్తూరు
Psycho Goes on a Rampage After Driving a Police Vehicle
గంగవరం మండల కేంద్రంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. కర్ణాటకకు చెందిన రత్నాకర్ తన భార్యతో గొడవపడి దండపల్లి క్రాస్ వద్ద నిలిపి ఉంచిన పోలీస్ వాహనంలో దూరాడు. అనంతరం ఇష్టానుసారంగా నడిపి ఓ ఆటోను ఢీకొనడంతో డ్రైవర్ రెండు కాళ్లు విరిగిపోయాయి. తరువాత మరో కారును ఢీకొనడంతో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం వాహనాన్ని వదిలేసి పరుగులు తీసే క్రమంలో చెరువులో పడ్డాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది పట్టుకున్నారు.
- Advertisement -



