ఖమ్మంలో ప్రజాపాలన దినోత్సవం
Public Governance Day in Khammamఖమ్మం
పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ కమిషనర్ జిల్లా ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ, నాటి హైదరాబాద్ సంస్థానం రాజుల పాలన నుండి భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య ప్రజాపాలన దశలోకి పరివర్తన చెందింది. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించింది. ఖమ్మం జిల్లా రాష్ట్రం లో జరిగిన అన్ని సాహిత్యం సాంస్కృతిక పోరాటాల లో ముందు ఉంది. అది శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాష నిలయం పూనిక తో మొదలైన గ్రంధాలయ ఉద్యమం మూడవ ఆంధ్ర మహాసభ ల నిర్వాహన గ్రంధాలయ ఉద్యమ సదస్సులు ఖమ్మం మధిర కేంద్రంగా జరిగాయి.
ఖమ్మం బౌగోళికంగా ఒక నాడు వరంగల్ జిల్లాలో భాగం అయిననప్పటికీ యాభై ల తర్వాత జిల్లా ఆవిర్భవించిన క్రమం లో ఈ ప్రాంతానికి ఒక వెసులుబాటు ఉంది. దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యం కలిగిన రైల్వే లైన్ ఖమ్మం మీదుగా పోవడం ఒక అంశం అయితే బ్రిటష్ వలస జిల్లా కృష్ణా , గోదావరి జిల్లాల కు సరిహద్దు లో ఖమ్మం ఉండడం ఒక సానుకూల అంశం. ఈ విధంగా రెండు భిన్నమైన సంస్కృతుల మధ్య వారధిగా ఈ జిల్లా ఉండడం మూలంగా ఈ ప్రాంత ప్రజలు రెండు భిన్న పాలనా వ్యవహారాలను దగ్గరగా గమనించే అవకాశం కలిగింది.
ఆక్రమం లో రెండు భిన్న సమాజాల తో సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక సత్ సంభంధాలు కలిగి ఉండడం బౌగోళికంగా ఖమ్మం జిల్లాకు సానుకూల అంశం. ఆ సానుకూలత అంశం ఉండడం మూలంగా నే దేశ వ్యాప్తంగా వచ్చిన అన్ని ప్రత్యామ్నాయ ఆలోచనలను,అన్ని ప్రజాస్వామిక విప్లవ పోరాటాలను,సాహిత్యం,కథ కవిత్వం,పాట నవల లాంటి అనేక ప్రక్రియల లో ఇక్కడ సాహిత్యం రాష్త్రం లో ఏ ప్రాంతానికి కూడా తక్కువ కాకుండా రాశిలో వాసిలో తన స్థానాన్ని సుస్థిర పరిచింది. ఖమ్మం జిల్లా పాట రాజకీయంగా ఆంధ్ర మహాసభ, దాని కొనసాగింపుగా జరిగిన జాతీయోద్యమ కాలంలో చిరుజల్లుగా వట్టికొండ రంగయ్య, మొదలు ప్రజా నాట్యమండలి. జాతీయోద్యమానికి, భాషోద్యమానికి, వామపక్ష ఉద్యమానికి స్పూర్తిని ఇచ్చిన ఆంధ్ర మహాసభ లు తెలంగాణా లో పోరాట ఉద్యమాలకి బీజం వేసినవి. అనేక ప్రజా ఉధ్యమాలు పాయలు చాయలు సమిష్టిగా కుల మత ప్రాంత వివక్షలను పారద్రోలడానికి గేయ ప్రక్రియ ఉపయోగపడినదని అన్నారు.
ఖమ్మం జిల్లా మధిర తాలూకా అల్లీనగరం ఇటు నిజాం ప్రాంతానికీ బ్రిటిష్ ఆంధ్ర సరిహద్దు గ్రామం అవడం మూలంగా తరచూ ఘర్షణలు జరుగుతూ ఉండేవి.
గ్రామ ప్రజలు రాజకీయ చైతన్యం తో ఉండేవారు గ్రామం మొత్తం నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలం లో అగ్ర నాయకత్వం ఈ గ్రామం తో సత్సంభందాలు కలిగి ఉండేవారు. ఒక ఒక నాటి ప్రజా పోరాటాలకు అల్లీనగరం కేంద్రంగా ఉండేది. నిజాం ప్రేరేపిత రాజాకార్ లు వామపక్ష రాజకీయాల లో ఉన్న నాయకుల కోసం బ్రిటిష్ అధికారులు వేటాడుతూ ఉండేవారు. అటువంటి నిత్యకల్లోలితి ప్రాంతం లో పుట్టిన వాడే వట్టికొండ రామకోటయ్య. మధిర తాలూకా అల్లి నగరం లో సుబ్బయ్య లక్ష్మమ్మ లకు జన్మించిన రామకోటయ్య గారు నాటి జాతీయోద్యమ స్పూర్తితో ప్రజా పోరాటాల లో బాల్యం నుండే పాల్గొన్నాడు. ఖమ్మం జిల్లా జాతీయోద్యమ పోరాటం గుర్తుకు వస్తే వట్టికొండ సోదరులు అయిన వట్టికొండ లక్ష్మి కాంతయ్య,వట్టికొండ నాగేశ్వరావు ఎలుగెత్తి పాడిన సమార గీతాలు ఆంధ్ర మహాసభ కార్యక్రమాల లో వాళ్ళు నడిపిన సాంస్కృతిక పోరాటం వాళ్ళు ఎలుగెత్తి పాడిన ప్రభోదాత్మక గేయాలు గుర్తుకు వస్తాయి. అంతే కాకుండా ఖమ్మం జిల్లా మధిర తాలూకా అల్లీనగారానికి చెందినా వట్టికొండ రామకోటయ్య రాసిన పందొమ్మిది వందల నలభై ఐదు కాలాన ప్రచురించబడిన ‘ఆంధ్ర గేయాల సంపుటి’ చరిత్ర కు సజీవ సాక్షం. మహత్తరమైన తెలంగాణ సాయుధపోరాటం జరుగుతున్న కాలాన ఖమ్మం నాటి వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. వరంగల్,నల్గొండ ఖమ్మం పోరాట క్షేత్రాలు. ఖమ్మం సమీప గ్రామాలు ముదిగొండ, గోకినేపల్లి, వెంకటాయపాలెం,తెల్దారుపల్లి, మధిర,ఎరుపాలెం, మధిర, తెలంగాణ సాయుధ క్షేత్రాలు. రావెళ్ళ సత్యం, రావెళ్ళ వెంకట రామారావు,చిర్రావూరి లక్ష్మి నారాయణ,హీరాలాల్ మోరియా,ఎందరో తెలంగాణ సాయుధపోరాటం లో బాగం అయ్యారు. సాయుధపోరాట విరమణ తర్వాత ఒక వైపు విశాలాంధ్ర లో ప్రజా రాజ్యం నినాదం మరో వైపు ప్రత్యేక తెలంగాణ నినాదం బలంగా ముందుకు వచ్చాయని అన్నారు.




