Tuesday, May 19, 2026

08 న పుట్టపర్తి లో   ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చే ప్రజా గ్రీవెన్స్

- Advertisement -

08 న పుట్టపర్తి లో   ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చే ప్రజా గ్రీవెన్స్

Public grievance by MLA Palle Sindhura Reddy in Puttaparthi on 08

15 న ఓడి చెరువు లో ఎమ్మెల్యే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం

పుట్టపర్తి :07

తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో
పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం శనివారం పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ ఏర్పాటు చేసినట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి  వ్యక్తి గత కార్యదర్శి ముద్దుపాటి లక్ష్మీనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరణ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి  దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని కోరారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

15 న శనివారం ఓడి చెరువులో ఎమ్మెల్యే ప్రజాగ్రీవెన్స్ సెల్

అదేవిధంగా ఈనెల 15న శనివారం ఓడి చెరువు టిడిపి కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదుల విభాగానికి ఓడిచెరువు ,నల్లమాడ , ఆమడ గూరు మండలాలతో పాటు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను స్వయంగా ఎమ్మెల్యే ,మాజీ మంత్రి  దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్