పరిశుభ్రత లో ప్రజల భాగస్వామ్యం అవసరం

- Advertisement -

పరిశుభ్రత లో ప్రజల భాగస్వామ్యం అవసరం

Public participation in cleanliness is essential

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 17,

గ్రామాల పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఎంపీపీ ఫోనుకుమాటి శేషులత పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం మండలం పడాలలో  స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారి యం వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో విశ్వనాధ్ స్వచ్ఛతపై గ్రామంలో అవగాహన కల్పించారు. అనంతరం గ్రామ ప్రజలు కూటమి నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి  మానవహారంగా ఏర్పడి స్వచ్ఛత సాధించేందుకు అందరి భాగస్వామ్యం కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తన్నీడి సాల్మన్ రాజు, కామిశెట్టి ఉమా శంకర్, కామిశెట్టి శ్రీనివాస్, కొత్త ధనరాజు, కుంచె లక్ష్మణరావు, మాజీ ఎంపిటిసి కామిశెట్టి జయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి కే శ్రీనివాస్,. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular