8.3 C
New York
Friday, April 19, 2024

దోమకొండ సొసైటీ పరిధిలో 1230 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు…

- Advertisement -

ఉమ్మడి దోమకొండ సొసైటీ పరిధిలో 1230 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు… మండల పరిధిలో పది రైస్ మిల్లలకు తరలింపు..
– 2200 మంది రైతుల నుండి కొనుగోలు..
– 27 కోట్ల తొమ్మిది లక్షల 69 వేల రూపాయలు చెల్లింపు…
– మానిటరింగ్ అధికారి యు సాయిలు…
– ఆడిట్లో అవకతవకలు బయటపడితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం..
– మానిటరింగ్ అధికారి యు సాయిలు…
దోమకొండ ఫిబ్రవరి 6 వాయిస్ టుడే!
కామారెడ్డి జిల్లా ఉమ్మడి దోమకొండ మండలం పరిధిలో ముత్యంపేట, దోమకొండ, బిబిపేట సొసైటీ పరిధిలో 2200 మంది రైతుల నుండి 1230 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు, 27కోట్ల 9 లక్షల 69 వేల రూపాయలను చెల్లించినట్లు మాన టరింగ్ అధికారి సాయిలు తెలిపారు. మండల కేంద్రంలోని సొసైటీలో మంగళవారం జనరల్ తనిఖీలో భాగంగా ఆడిట్ నిర్వహించారు. సంవత్సరం ఒక్కసారి జమా ఖర్చు చూస్తామని, తప్పులు జరిగినట్లయితే అధికారులకు నోటీసులు ఇవ్వడంతో పాటు, శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. డిసిసిబి, మార్కెటింగ్ సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. ఒక్కో సొసైటీకి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఏటా 2000 రూపాయలు ఇస్తుందని తెలిపారు. దోమకొండ సొసైటీకి కాంట్రాక్టర్ మాజీదు 13 లారీలను మండలానికి కేటాయించినట్లు ఆ 13 లారీలతోనె ఉమ్మడి దోమకొండ మండలంలో పది రైస్ మిల్లకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దోమకొండ, గొట్టిముక్కుల, లింగుపల్లి, అంచనూరు, మాందాపూర్. చింతమానుపల్లి, గ్రామాలలో వర్షాకాలంలో రైతులనుండి సేకరించిన ధాన్యాన్ని ఉమ్మడి మండలంలోని 10 రైస్ పిల్లలకు పంపించినట్లు తెలిపారు. శ్రీనివాస ఆగ్రోస్ బిబిపేట, శ్రీనివాస ట్రేడర్స్, బీబీ పేట, టి నాగరాజు బివిపేట, హరిహరా ఇండస్ట్రీస్, బిబిపేట, ఎస్ ఆర్ ఆర్ యాడారం కన్నమ్మ దోమకొండ, శివ బాలాజీ దోమకొండ, మణికంఠ, శాకాంబరి ఆగ్రో లిమిటెడ్ జంగంపల్లి రైసు మిల్లులకు కాంట్రాక్టర్ ద్వారా పదమూడు లారీలలో చేరవేశామన్నారు. కామారెడ్డి జిల్లాలో ఆరు క్లస్టర్లు ఉన్నాయని, కామారెడ్డి, సదాశివ నగర్, ఎల్లారెడ్డి. బాన్సువాడ. పిట్లం, భిక్కనూరు క్లస్టర్లలో ఒక్కో క్లస్టర్లో నలుగురు ఆడిట్ అధికారులు ఉంటారని సొసైటీలను పర్యవేక్షిస్తుంటామని జమా ఖర్చులు పకడిబందుగా ఆడిట్ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఉన్నట్లయితే, రైస్ మిల్లు యజమానులు రైతులను ఇబ్బందులకు గురిచేసిన జిల్లా అధికారి శ్రీనివాసరావు
910011 5755 నంబర్ కి కాల్ చేయాలని మానిటరింగ్ ఆఫీసర్ రైతులకు సూచించారు. కొన్ని సొసైటీలలో అక్రమాలు జరుగుతున్న సమాచారం ఉన్న అప్పటికి పూర్తి సమాచారం లేకపోవడంతో వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నామని పూర్తి సమాచారంతో ఫిర్యాదు చేసినట్లయితే, సొసైటీ సిబ్బందిపై, రైస్ మిల్ యజమానులపై, లారీ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాచారాన్ని ఇవ్వనట్లయితే ఆర్టిఐ 2005 ఆక్ట్ ద్వారా సమాచారాన్ని, తెలుసుకోవచ్చని సూచించారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!