పారిశుధ్య నిర్వహణ, గ్రీనరీ పెంపు లక్ష్యాలుగా స్వచ్చదనం -పచ్చదనం……
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి
Purity – Greenness as objectives of Greenery increase…
పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీనరీ పెంపు లక్ష్యాలుగా ప్రభుత్వం స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించింద ని, మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని పెద్దపల్లి పట్టణంలో ప్రారంభించారు. పెద్దపెల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అమర్ నగర్ చౌరస్తా , మసీదు, జెండా, సివిల్ ఆసుపత్రి మీదుగా మళ్లీ ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు చేపట్టిన స్వచ్చదనం – పచ్చదనం అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి జెండా ఊపి ప్రారంభించా రు. స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం క్రింద ఆగస్టు 5 నుంచి 9 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను మున్సిపల్ కమిషనర్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను పెద్ద ఎత్తున భాగవతం చేయాలని లక్ష్యంతో ముందస్తుగా ర్యాలీ చేపట్టామని కలెక్టర్ తెలిపారు.
స్వచ్చదనం – పచ్చదనం ర్యాలీలో వివిధ పాఠశాల విద్యార్థులు, కళాకారులు, మెప్మా మహిళా సంఘాల పెద్ద ఎత్తున పాల్గొన్నాయని, వీరు ఇంటికి వెళ్లిన తరువాత ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని, గ్రీనరీ పెంచే దిశగా మొక్కలు నాటి వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం విజయ వంతంగా నిర్వహించడానికి ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని ఆయన కోరారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాలను ప్రతి రోజు పక్కాగా నిర్వహించి రాష్ట్రంలోనే మన జిల్లా ప్రధమ స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని , ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం స్వచ్చదనం – పచ్చదనం వ్యాస రచన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ చేతుల మీదుగా బహుమ తులు అందజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ ప్రమోద్ కుమార్, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.