Saturday, December 14, 2024

పుష్ప 2..త్వరలో మరో టీజర్‌..!

- Advertisement -

పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో ఆయనకు ప్రపంచంలోనే ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా పలు భాషల్లో రిలీజయ్యి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది.

ఇక, తాజాగా రాబోతున్న పుష్ప 2 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఇటీవలే విడుదలయ్యిన పుష్ప 2 టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. అయితే, ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్ అందింది. అభిమానుల్లో మరింత జోష్ నింపేందుకు పుష్ప 2 నుంచి మరో టీజర్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోన్నట్లు సమచారం. ఈ న్యూస్ విన్న బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప-2. ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు భారీస్థాయిలో పెరిగిపోతున్నాయి. ఆ సినిమా గురించి వచ్చిన వార్తలు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవలే అల్లుఅర్జున్ పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్​ పుష్ప 2 టీజర్ ను వదిలారు. ఇక, ఈ టీజర్‌పై అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్​ వచ్చింది. ఈ టీజర్‌ను విడుదలయిన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్​ను సైతం షేక్ చేసింది. ఇక, ఈ టీజర్​లో అల్లుఅర్జున్ అమ్మోరు గెటప్​లో కనిపిస్తారు. బన్నీనీ ఈ గెటప్‌లో చూసిన ఆయన ఫ్యాన్స్​ పూనకాలతో ఊగిపోయారు. టీజర్ చివర్లో ఫైట్ సీన్​ ఉంటుంది. అయితే, ఈ టీజర్‌కు వచ్చిన భారీ రెస్పాన్స్ దృష్ట్యా ఈ సినిమా నుంచి మరో టీజర్‌ను విడుదలచేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయినట్లు తెలుస్తోంది.

టీజర్ అనంతరం పాట కూడా..

అయితే, బన్నీ అభిమానుల్లో మరోసారి ఫుల్ జోష్​ నింపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పుష్ప 2 సినిమా నుంచి మరో టీజర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యిందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌. ఇక, రాబోయే ఈ టీజర్‌లో పలు డైలాగ్స్​తోపాటు, మరో యాక్షన్ సీన్​ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ టీజర్ అనంతరం ఓ పాటను సైతం విడుదల చేయాలని మూవీ మేకర్స్ అనుకుంటున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇదే నిజమైతే ఇక ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పుకోవాలి. ఏది ఏమైనా పుష్ప 2 కోసం బన్నీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్