పుష్ప-2′ ది రూల్ సన్సేషనల్ లిరికల్ వీడియో సాంగ్ పుష్ప….. పుష్ప… పుష్ప… పుష్పరాజ్ విడుదల
అదిరిపోయే సంగీతం… మెస్మరైజ్ చేసే విజువల్స్… హైక్లాస్ మేకింగ్.. ఊరమాస్ స్టెప్స్… క్లాప్ కొట్టించే ఐకాన్‌స్టార్ స్వాగ్… వినగానే వావ్ అనిపించే లిరిక్స్.. ఇలా ఒకటేమిటి.. పుష్ప… పుష్ప…పుష్ప.. పుష్పరాజ్.. నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే.. దేశం దద్దరిలే.. ఈ పాట వింటూంటే అందరికి గూజ్‌బంప్స్.. ఇక ఐకాన్‌స్టార్ అభిమానుల సంబరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎస్… అందరూ ఎంతో ఎదురుచూస్తున్న పుష్ప-2 ది రూల్ లోని తొలి లిరికల్ వీడియో వస్తున్న అప్లాజ్ అది.. పుష్ప… పుష్ప…పుష్ప.. పుష్పరాజ్.. నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే.. దేశం దద్దరిలే.. అనే లిరికల్ వీడియోను బుధవారం విడుదల చేశారు మేకర్స్… చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాట హై మాసివ్‌గా పూర్తి కమర్షియల్‌గా సాంగ్‌గా వుంది. చిత్రంలో పుష్ప ది రూల్‌ను ఎలివేట్ చేసే విధంగా, పుష్ప క్యారెక్టరైజేషన్ మీద సాంగ్ వుంది. వినగానే అందరికి ఈ పాట ఎంతో నచ్చే విధంగా వుంది. విజయ్ పొల్లంకి, శ్రేష్టి వర్మ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటను తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో కూడా విడుదల చేశారు. తాజాగా వదిలిన ఈ పాటతో అటు ఐకాన్‌స్టార్ అభిమానులు, ఇటు పుష్ప ప్రేమికులు సంబరాల్లో వున్నారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.నటీనటులు:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు