- Advertisement -
దుమ్ము రేపుతున్న పుష్ప2 ట్రైలర్
Pushpa 2 Trailer going viral
హైదరాబాద్, నవంబర్ 19, (వాయిస్ టుడే)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప 2 : ది రూల్’ వచ్చే నెల 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. నిన్న సాయంత్రం ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసారు మేకర్స్. సోషల్ మీడియా లో డివైడ్ రెస్పాన్స్ వచ్చింది కానీ, యూట్యూబ్ లో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది ఈ థియేట్రికల్ ట్రైలర్. ఇటీవలే కాలం లో వచ్చిన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ టీజర్ రికార్డ్స్ ని 24 గంటలు కూడా గడవకముందే బ్రేక్ చేసి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది ‘పుష్ప 2’ ట్రైలర్. యూట్యూబ్ లో ఇప్పటి వరకు అప్డేట్ అయిన వ్యూస్ ఎంతంటే తెలుగు లో 41 మిలియన్ వ్యూస్, హిందీ లో 29 మిలియన్ వ్యూస్, తమిళం లో 3.7 మిలియన్ వ్యూస్, మలయాళం 2 మిలియన్ వ్యూస్ బెంగాలీ లో 5 లక్షల వ్యూస్ వచ్చాయి. ఓవరాల్ గా అన్ని భాషలకు కలిపి 70 మిలియన్ వ్యూస్ వచ్చాయి.ఇవి యూట్యూబ్ లో అప్డేట్ అయిన పబ్లిక్ వ్యూస్ మాత్రమే. ఓవరాల్ రియల్ టైం వ్యూస్ 100 మిలియన్ కి పైగానే ఉంటుందని సమాచారం. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ టీజర్ కి 24 గంటల్లో 70 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ‘పుష్ప 2’ ట్రైలర్ కి 24 గంటల లోపే 70 మిలియన్ వ్యూస్ దాటడం విశేషం. దీనిని బట్టి ‘పుష్ప 2’ కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పుష్ప 1 లో సుకుమార్ అల్లు అర్జున్ క్యారక్టర్ ని ఎంత యాటిట్యూడ్ తో చూపించాడో, ‘పుష్ప 2’ లో అంతకు మించి వైల్డ్ యాటిట్యూడ్ తో చూపించినట్టు ట్రైలర్ ని చూస్తుంటే అర్థం అవుతుంది. మొదటి రోజు కచ్చితంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఈ సినిమా సంచలనం సృష్టించబోతుందని అభిమానులు బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత.ఓవర్సీస్ లో నిన్న మొన్నటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నెమ్మదిగా జరుగుతూ ఉండేది. నెల రోజుల ముందు మెయిన్ థియేటర్స్ అన్నిట్లో 3 వేలకు పైగా షోస్ లో బుకింగ్స్ ప్రారంభించినా ఇంత స్లోగా ఉన్నాయేంటి?, పుష్ప 2 అనుకున్న టార్గెట్స్ ని చేరుకుంటుందా లేదా అనే టెన్షన్ ఉండేది. కానీ ట్రైలర్ విడుదల తర్వాత బుకింగ్స్ ఊపు అందుకున్నాయి. మొన్నటి వరకు 8 లక్షల 75 వేల డాలర్స్ గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా, నిన్న ట్రైలర్ విడుదల తర్వాత 1 మిలియన్ మార్కుని దాటిందని అంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మామూలు రేంజ్ లో ఉండవని, ప్రీమియర్స్ నుండి 3 మిలియన్ డాలర్లు వస్తాయని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్.
- Advertisement -