గొప్ప రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు
PV Narasimha Rao was a great statesman సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు
షేక్ జిలాని భాష
కర్నూల్
భారత దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన గొప్ప రాజనీతిజ్ఞుడు మన పివి నరసింహారావు గారని కర్నూలు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షేక్ జిలాని భాష అభిప్రాయపడ్డారు. భారత మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు 20 వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన హయాంలో భూసంస్కరణల చట్టం అమలు చేసి వందలాది ఎకరాలు కలిగివున్న భూస్వాముల నుంచి భూములను ఒకే చట్టం ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేట్టు చేశారని భూస్వాముల ఆగ్రహావేశాలను లెక్కచేయకుండా భూసేకరణ చట్టం పకడ్బందీగా అమలు చేసిన ధైర్యశాలి మన పివి గారని భూస్వాముల కుటుంబానికి చెందిన పీవీ తన పన్నెండు వందల ఎకరాల భూమిని భూమిలేని పేదలకు పంచారని పివీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పెత్తందార్లు అడవులలోని వన్యమృగాలను చంపడంతో చలించిపోయి వాటి సంరక్షణకు వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారని, పివీ సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించు కోవాలని భావించిన శ్రీమతి ఇందిరా గాంధీ ఆయనను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారని, పివి శ్రీమతి ఇందిరా గాంధీ కి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారని, ఎమర్జెన్సీ తర్వాత దేశమంతటా కాంగ్రెస్ ఓడిపోయినా మన రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ జెండా రెపరెప లాడించాడని నాడు రాష్ట్రంలో 42 పార్లమెంటు స్థానాల్లో 41 స్థానాలు కాంగ్రెస్‌కు రావడం వెనుక పివి పాత్ర కీలకమని, ఇందిరా గాంధీ హయాంలో తన బహుముఖ ప్రతిభ సామర్థ్యాన్ని అంతర్జాతీయ దౌత్యానికి ఉపయోగించారని ఆయన సేవలను జిలాని భాష కొనియాడారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు మాట్లాడుతూ పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆరు మాసాల్లో నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన ఘనత మన పివి కి దక్కుతుందని, భారత ప్రధానిగా ఉన్న కాలంలో దేశంలో ఎన్నో రాజకీయ ఆర్థిక సామాజిక మలుపులు చోటు చేసుకున్నాయని దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించి సంస్కరణలకు బీజం వేశారని అందుకే పీవీని దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పిలుస్తారని, దేశాన్ని ఏలిన ఏకైక తెలుగు వాడిగా చరిత్రకెక్కిన పీవీ గొప్పతనం గురించి ప్రసంగించారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయం నందలి స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు చిత్రపటమునకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తల సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కే వెంకటరెడ్డి, ఎన్ సి బజారన్న, సయ్యద్ నవీద్, ఎస్ ప్రమీల, షేక్ ఖాజా హుస్సేన్, ఈ లాజరస్, డివి సాంబశివుడు, బి సుబ్రహ్మణ్యం, షేక్ మాలిక్, వెల్దుర్తి శేషయ్య, అబ్దుల్ హై, అక్బర్, మిన్నెలా హుస్సేన్, ఐఎన్ టియుసి ఆర్ ప్రతాప్ మహిళా కాంగ్రెస్ మల్లేశ్వరి, శ్రీలత, రమణమ్మ, ఈశ్వరి, రుక్సానా మొదలగు వారు పాల్గొన్నారు.




