- Advertisement -
వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందించాలి
Quality food should be provided in hostels
వికారాబాద్
వసతి గృహాల్లో నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలోని గిరిజన బాలికల పాఠశాల, మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగదిని, విద్యార్థులకు అందించే బియ్యాన్ని పరిశీలించారు. వంట కోసం, తాగునీటి కోసం నాణ్యతను పరిశీలించేందుకు 12 వేల హెచ్ టు ఎస్ టెస్ట్ వైల్ కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలలో త్రాగునీటిలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నట్టు తెలుసుకోవడానికి ఇట్టి వైల్ ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. వంట చేసేటప్పుడు , విద్యార్థులకు భోజనం వడ్డించే క్రమంలో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సిబ్బందికి సూచించారు. వసతి గృహాలకు సరఫరా చేస్తున్న బియ్యం బాగు లేనట్లయితే తిరిగి పంపించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. విద్యార్థినీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, తహసిల్దార్ ఆనందరావు, ఎంపీడీవో ఎం.ఏ. కరీం ఉన్నారు.
- Advertisement -