విజయవాడ, సెప్టెంబర్ 19: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్, ఎఫ్‌ఐఆర్ క్వాష్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. మరో బెంచ్‌లో ఇన్నర్‌రింగ్ రోడ్ మార్పు కేసులో బెయిల్ అంశంపై విచారణ జరుగుతుంది. ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ 21కి వాయిదా వేశారు. చంద్రబాబు తరపున వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా.. సీనియర్ లాయర్ సిద్ధార్థ్ అగర్వాల్, లండన్ నుంచి వర్చువల్‌గా హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి.. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం తరపున రంజిత్‌కుమార్ వాదనలు వినిపిస్తున్నారు.స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు. చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సమయం ఇచ్చింది. దీంతో గత శుక్రవారమే క్వాష్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరపున, అటు సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్నారు లాయర్లు.