కోరం లేక వాయిదా పడ్డ మండల సర్వసభ్య సమావేశం
Quorum or adjourned Mandal General Meeting
బుధవారం రోజున మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు.
తుగ్గలి ఎంపీడీవో విశ్వమోహన్.
తుగ్గలి:
మండల కేంద్రమైన తుగ్గలిలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు మంగళవారం రోజున నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం ఎంపీటీసీల కోరం లేనందున సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు తుగ్గలి ఎంపీడీవో విశ్వమోహన్ తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం రోజున ఉదయం 11:30 గంటలకు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అద్దంకి ఎర్ర నాగప్ప ఆధ్వర్యంలో యధావిధిగా స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనం నందు మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. కావున బుధవారం రోజు నిర్వహించు మండల సర్వసభ్య సమావేశానికి వివిధ శాఖల మండల స్థాయి అధికారులు తమ నివేదికలతో హాజరుకావాలని, అదేవిధంగా మండల పరిధిలోని గల ఎంపీటీసీ లు,సర్పంచులు తప్పకుండా హాజరుకావాలని ఎంపీడీవో విశ్వమోహన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర నాగప్ప,తహసిల్దార్ రమాదేవి,ఏవో పవన్ కుమార్,ఈఓఆర్డి శ్రీహరి,ఎంఈఓ మాలతి,ఏపీఎం రాధాకృష్ణ, హౌసింగ్ డిఇ విజయ్ కుమార్,ఎంపీటీసీలు రాందాస్ నాయక్,పుష్పవతి లు తదితరులు పాల్గొన్నారు.