- Advertisement -
జగిత్యాల అభ్యర్థిగా బల్కం మల్లేష్ యాదవ్
జగిత్యాల: బీఎస్పీ పార్టీ జగిత్యాల అసెంబ్లీ అభ్యర్థిగా బల్కం మల్లేష్ యాదవ్ ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. సోమవారం హైద్రాబాద్ లో విడుదల చెందిన జాబితాలో బిసి సామాజిక వర్గానికి చెందిన బల్కం మల్లేష్ యాదవ్ యాదవ సంఘ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ కుల, సామాజిక అంశాలపై నిరంతర పోరాటాలు చేసిన నేపద్యాన్ని గుర్తించి జగిత్యాల అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ నా అభ్యర్థిత్వానికి కృషిచేసిన జిల్లా ఇంచార్జ్ లు మద్దెల నారాయణ, చిర్ర శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు దేవ్ సింగ్ రాథోడ్ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -