- Advertisement -
రబీ ఈ పంట నమోదు చేసుకోండి: ఏవో ఎన్ .లక్ష్మీనారాయణ
Rabi Register this crop: AO N. Lakshminarayana
దొనకొండ డిసెంబర్ 17
రబీ సీజన్ లో సాగు చేసిన పంటలకి ఈ పంట నమోదు చేయించుకోవాలని మంగళవారం మండల వ్యవసాయధికారి ఎన్ లక్ష్మి నారాయణ కోరారు .గ్రామ వ్యవసాయ సహయకులకు ఈ పంట నమోదు మొబైల్ యాప్ నేటి నుండి పనిచేస్తుందని పొలం పిలుస్తోంది కార్యక్రమo లో భాగంగా పెద్దన్నపాలెం, గంగదేవిపల్లి రైతు సేవా కేంద్రo రైతులతో మాట్లాడుతూ వివరాలు తెలియజేశారు. వరి, మొక్కజొన్న, మినుములు, పప్పు శనగ, ఎండు మిరప సాగు చేసిన వారు తప్పకుండ నమోదు చేయించుకోవాలని, వ్యవసాయ సిబ్బందికి రైతులు తాము సాగు చేసినపంట, సర్వే నెంబర్ల వివరాలతో దరఖాస్తు అందజేసినట్టయితే వారు సంబంధిత రెవిన్యూ సిబ్బందితో కలిసి పొలాలని సందర్శించి నమోదు చేస్తారన్నారు.ఇందులో నమోదు అయితేనే పంటల భీమా, ఇన్పుట్ సబ్సిడీ, కొనుగోలు కేంద్రాలలో పంట అమ్ముకోవడానికి
వీలవుతుందని తెలిపారు.
తర్వాత పెద్దన్న పాలెం లో కంది, మిరప పంటల్ని పరిశీలించి కొమ్మ తెగులు, మారుకా మచ్చల పురుగుల నివారణ చర్యల్ని రైతులకి తెలియజేశారు.
ఆయా గ్రామాల రైతులు, గ్రామ వ్యవసాయ సహాయకులు అరుణా దేవి, వీణా కుమారి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -