Wednesday, February 18, 2026

 రాబోయే రోజుల్లో వానలు

- Advertisement -

 రాబోయే రోజుల్లో వానలు
హైదరాబాద్, ఫిబ్రవరి 18

Rains in the coming days
ఈ ఏడాది తొలిసారిగా అకాల వర్షాలు వచ్చే వారం కురవనున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. వడగళ్లు, పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వచ్చే వారం 20 నుంచి 40 మిమీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసిందివాతావరణ నిపుణుడు టి. బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 22, 23, 24 తేదీలలో తెలంగాణలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఐఎమ్‌డీ అంచనా ప్రకారం వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది. పొగమంచుతో ఉదయం వేళ ప్రజలు ఇబ్బంది పడతారు. ఇరవై నుంచి నలభై మిల్లీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్ వాసులను సైతం అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ పొగమంచు కురుస్తుందని పేర్కొన్నప్పటికీ, వర్షాలకు సంబంధించి ఎటువంటి హెచ్చరికను జారీ చేయలేదు. ఫిబ్రవరి 20 వరకు ఉదయం లేదా రాత్రి సమయాల్లో పొగమంచు కురుస్తుంది.  వర్షాలు, వడగళ్ల వానల సూచనల ప్రకారం వచ్చే వారంలో అందుకు తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కనుక, ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2026 సంవత్సరంలో తొలిసారి అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే ప్రమాదం ఉందని, ఇప్పటికే రాష్ట్రంలో పొగమంచు కురుస్తుందని అటు భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఫిబ్రవరి నాలుగో వారంలో వర్షాలు కురవనున్నాయి. ఫిబ్రవరి 22, 23, 24 తేదీలలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్ నిపుణుడు టి. బాలాజీ సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్